Banswada News
రేషన్ లబ్ధిదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తిచేసుకోవాలి.
Quick Summary:
𝐌𝐎𝐇𝐒𝐈𝐍 𝟓𝐓𝐕 𝐍𝐄𝐖𝐒 𝐑𝐄𝐏𝐎𝐑𝐓𝐄𝐑
మోసిన్ 5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ మండలం లోని రేషన్ కార్డు లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని బాన్సువాడ తహసీల్దార్ రాజా నరేందర్ గౌడ్ సూచించారు. బుధవారం పట్టణంలోని తాసిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు ఈనెల 31వ తేదీ వరకు మాత్రమే గడువు ఉన్నందున, ఇప్పటివరకు ప్రక్రియ పూర్తి చేయని రేషన్ కార్డుదారులు వెంటనే సమీపంలోని రేషన్ దుకాణం డీలర్‌ను సంప్రదించాలని తెలిపారు.గడువులోగా ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే భవిష్యత్‌లో రేషన్ సరుకులు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. రేషన్ కార్డుదారులు గడువు ముగిసేలోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు.