Banswada News
ప్రాజెక్టులోకి 24 గంటల్లో 3,935 క్యూసెక్కుల వరద నీరు.. నీటిమట్టం పెరుగుదల.
Quick Summary:
నిజాంసాగర్ ప్రాజెక్ట్ అప్డేట్...
మోసిన్ 5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి 3,935 క్యూసెక్కుల వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు, పూర్తి నీటిమట్టం 1,405 అడుగులుగా ఉంది.ప్రస్తుతం ప్రాజెక్టులో 1,395.83 అడుగుల నీటిమట్టం నమోదుకాగా, 7.146 టీఎంసీల నీరు నిల్వ ఉంది.గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టులో 4.622 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, నీటిమట్టం 1,391.30 అడుగులుగా నమోదైంది.గత ఏడాదితో పోలిస్తే ఈసారి ప్రాజెక్టులో నీటి నిల్వలు మెరుగ్గా ఉండటం రైతులకు, సాగునీటి అవసరాలకు ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు. అధికారులు ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.