Sun, Aug 02, 2026
YouTube
Rivx Studios
News Thumb తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు... News Thumb బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల బాలరాజ్. News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... News Thumb 5టీవీ న్యూస్ కథనానికి స్పందన... నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తప్పవన్న సూపరిండెంట్. News Thumb కుక్కల దాడుల నేపథ్యంలో చర్యలు.. ప్రత్యేక బృందాలతో పట్టివేత ప్రారంభం News Thumb ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం News Thumb వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి. News Thumb ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం... News Thumb పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. News Thumb మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి. News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. News Thumb కుక్కలు, కోతుల బెడుద నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. News Thumb రూ.21 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. News Thumb చెక్‌డ్యామ్‌లో జలకళ.. గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు... News Thumb లయన్ బాబురావు జన్మదినోత్సవం.. అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన సేవ News Thumb బాన్సువాడలో వీధి కుక్కల బీభత్సం.. రెండు రోజుల్లో 10 మంది చిన్నారులు కుక్క కాటుకు గురి. News Thumb తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు... News Thumb బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల బాలరాజ్. News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... News Thumb 5టీవీ న్యూస్ కథనానికి స్పందన... నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తప్పవన్న సూపరిండెంట్. News Thumb కుక్కల దాడుల నేపథ్యంలో చర్యలు.. ప్రత్యేక బృందాలతో పట్టివేత ప్రారంభం News Thumb ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం News Thumb వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి. News Thumb ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం... News Thumb పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. News Thumb మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి. News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. News Thumb కుక్కలు, కోతుల బెడుద నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. News Thumb రూ.21 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. News Thumb చెక్‌డ్యామ్‌లో జలకళ.. గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు... News Thumb లయన్ బాబురావు జన్మదినోత్సవం.. అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన సేవ News Thumb బాన్సువాడలో వీధి కుక్కల బీభత్సం.. రెండు రోజుల్లో 10 మంది చిన్నారులు కుక్క కాటుకు గురి.
తాజా వార్తలు
తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు... - Rivx Studios
Banswada News

తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు...

Published on August 2, 2026 at 5:12 PM

1,577 Views

Quick Summary:

మహిళల బోనాల ఊరేగింపు – ప్రత్యేక పూజలు, నైవేద్యాలతో అమ్మవారికి మొక్కులు.

5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రాంతంలో బోనాల పండుగను మహిళలు, స్థానికులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, నెత్తిన బోనాలను అలంకరించుకుని అమ్మవారికి సమర్పించేందుకు ఊరేగింపుగా తరలివెళ్లారు.అమ్మవారి బోనాలను పసుపు,కుంకుమ,పూలు, వేప ఆకులతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల ఊరేగింపులో మహిళలు భక్తి పాటలు పాడుతూ, సంప్రదాయ పద్ధతిలో ముందుకు సాగడంతో కాలనీ మొత్తం పండుగ వాతావరణం సంతరించుకుంది.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, కుటుంబ సభ్యులు, కాలనీ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భక్తులు ప్రార్థించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని స్థానికులు పేర్కొన్నారు.బోనాల కార్యక్రమంలో మహిళలు, యువతులు, చిన్నారులు, కాలనీ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల సంప్రదాయ వస్త్రధారణ, అలంకరించిన బోనాలు, వేప ఆకులు, పూలతో ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు సైతం పండుగ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం ఇళ్లలో బోనాల పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంతో కాలనీలో భక్తి భావం వెల్లివిరిసింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని,కాలనీ అభివృద్ధి చెందాలని స్థానికులు ఆకాంక్షించారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com