Sat, Aug 01, 2026
YouTube
Rivx Studios
News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... News Thumb 5టీవీ న్యూస్ కథనానికి స్పందన... నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తప్పవన్న సూపరిండెంట్. News Thumb కుక్కల దాడుల నేపథ్యంలో చర్యలు.. ప్రత్యేక బృందాలతో పట్టివేత ప్రారంభం News Thumb ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం News Thumb వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి. News Thumb ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం... News Thumb పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. News Thumb మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి. News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. News Thumb కుక్కలు, కోతుల బెడుద నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. News Thumb రూ.21 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. News Thumb చెక్‌డ్యామ్‌లో జలకళ.. గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు... News Thumb లయన్ బాబురావు జన్మదినోత్సవం.. అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన సేవ News Thumb బాన్సువాడలో వీధి కుక్కల బీభత్సం.. రెండు రోజుల్లో 10 మంది చిన్నారులు కుక్క కాటుకు గురి. News Thumb కుక్క దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్. News Thumb మదీనా కాలనీ ఘటన మరువకముందే.. మరో చిన్నారిపై కుక్కల దాడి... News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... News Thumb 5టీవీ న్యూస్ కథనానికి స్పందన... నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తప్పవన్న సూపరిండెంట్. News Thumb కుక్కల దాడుల నేపథ్యంలో చర్యలు.. ప్రత్యేక బృందాలతో పట్టివేత ప్రారంభం News Thumb ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం News Thumb వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి. News Thumb ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం... News Thumb పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. News Thumb మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి. News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. News Thumb కుక్కలు, కోతుల బెడుద నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. News Thumb రూ.21 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. News Thumb చెక్‌డ్యామ్‌లో జలకళ.. గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు... News Thumb లయన్ బాబురావు జన్మదినోత్సవం.. అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన సేవ News Thumb బాన్సువాడలో వీధి కుక్కల బీభత్సం.. రెండు రోజుల్లో 10 మంది చిన్నారులు కుక్క కాటుకు గురి. News Thumb కుక్క దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్. News Thumb మదీనా కాలనీ ఘటన మరువకముందే.. మరో చిన్నారిపై కుక్కల దాడి...
తాజా వార్తలు
కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. - Rivx Studios
KAMAREDDY

కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం.

Published on August 1, 2026 at 4:49 PM

4,248 Views

News Image
Quick Summary:

ట్రాఫిక్ నియమాల పాటింపుతోనే ప్రమాదాల నివారణ: జిల్లా ఎస్పీ

5టీవీ న్యూస్ ప్రతినిధి కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ భవనానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి, ప్రజలకు మరింత అనుకూలంగా నవీకరించిన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహన రద్దీ, ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను మరింత మెరుగు పరిచినట్లు తెలిపారు.ఈ సందర్భంగా కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ గౌడ్ ని జిల్లా ఎస్పీ స్వయంగా ఆయన విధి నిర్వహణ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. ట్రాఫిక్ నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం, వేగవంతమైన స్పందనతో విధులు నిర్వహించాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలో పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌కు అవసరమైన పోలీసు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. రహదారులపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజలకు సురక్షితమైన ప్రయాణ వాతావరణం కల్పించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ట్రాఫిక్ పోలీసులు చట్టాలను అమలు చేయడమే కాకుండా ప్రజలకు సేవలందించే బాధ్యతను కూడా నిర్వర్తించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు, పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య కేంద్రాలు, ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్ ను ఉల్లంఘించడం వంటి చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులు, పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ట్రాఫిక్ క్రమశిక్షణతోనే ప్రమాదాలను తగ్గించి సురక్షిత సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు. మీ కుటుంబం కోసం, మీ ప్రాణాల కోసం తీసుకునే ఉత్తమ నిర్ణయం.ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, కామారెడ్డి పట్టణ ఎస్‌హెచ్‌ఓ నరహరి, ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ గౌడ్, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసు అధికారులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com