5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని కాకతీయ పాఠశాలలో సోమవారం బోనాల పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను తలపై మోసుకొని ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు బోనాల పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ యాదగిరి , ఉపాధ్యాయులు అనురాధ, లక్ష్మి, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
Banswada News
కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు.
Quick Summary:
బోనాల సంబరాలతో కళకళలాడిన కాకతీయ పాఠశాల.