Banswada News
పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 15 చివరి గడువు.
Quick Summary:
బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్.
5టీవీ న్యూస్ బాన్సువాడ : అర్హులైన లబ్ధిదారులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను సంబంధిత పంచాయతీ కార్యదర్శికి లేదా మండల కార్యాలయంలో సమర్పించవచ్చని ఎంపీడీవో ఆనంద్ సూచించారు.దరఖాస్తులను సమర్పించేందుకు ఆగస్టు 15, 2026 చివరి తేదీగా పేర్కొన్నారు. అర్హులైన వారు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు ముగిసిన అనంతరం దరఖాస్తుల స్వీకరణపై స్పష్టత లేకపోవడంతో అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.