Banswada News
గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు.
Quick Summary:
జోరుగా బ్లాక్‌లో గ్యాస్ విక్రయాలు...
5టీవీ న్యూస్ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో వంటగ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.సాధారణంగా నిర్ణయించిన ధరకు లభించాల్సిన గ్యాస్ సిలిండర్‌ను కొందరు అక్రమంగా నిల్వ చేసి, అవసరమైన వినియోగదారుల నుంచి అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి.గ్యాస్ సిలిండర్ అవసరమైన వినియోగదారుల నుంచి ఒక్కో సిలిండర్‌కు సుమారు రూ.2,000 వరకు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో సామాన్య వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.గ్యాస్‌ను బ్లాక్‌లో విక్రయిస్తున్న వారిపై సంబంధిత అధికారులు నిఘా పెట్టి, అక్రమ విక్రయాలను అరికట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. అధిక ధరలకు గ్యాస్ విక్రయిస్తున్నట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అధికారులు స్పందించి బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేయాలని వినియోగదారులు కోరుతున్నారు.