Banswada News
బాన్సువాడలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు
Quick Summary:
బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, బాలరాజు
5టీవీ న్యూస్ బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు.గౌడ సంఘం, ఫోర్ వీలర్ అసోసియేషన్, గంగపుత్ర సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో నాయకులు, సంఘాల ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా కాసుల బాలరాజు మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
