Banswada News
శ్రీ చైతన్య పాఠశాలకు ఇచ్చిన నోటీసుల గడువు రేపటితో ముగింపు.
Quick Summary:
అనుమతి లేని తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు-ఎంఈఓ నాగేశ్వర్‌రావు.
5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ప్రస్తుతం 8వ, 9వ, 10వ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతి లేదని మండల విద్యాధికారి పి. నాగేశ్వర్‌రావు తెలిపారు.ఈ విషయమై 5టీవీ న్యూస్ ప్రతినిధి ఎంఈఓ పి. నాగేశ్వర్‌రావును వివరణ కోరగా, శ్రీ చైతన్య పాఠశాలకు 8వ, 9వ, 10వ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతి లేదని తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 4న యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామని, రేపటితో మూడు రోజుల గడువు పూర్తవుతుందని చెప్పారు. అప్పటికీ అవసరమైన అనుమతులు పొందకుండా అనుమతి లేని తరగతులను కొనసాగిస్తే, సంబంధిత యాజమాన్యంపై విద్యాశాఖ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తప్పవని ఎంఈఓ నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు.