Banswada News
లా విద్యార్థులకు ప్రథమ బహుమతి.
Quick Summary:
𝐌𝐎𝐇𝐒𝐈𝐍 𝟓𝐓𝐕 𝐍𝐄𝐖𝐒 𝐑𝐄𝐏𝐎𝐑𝐓𝐄𝐑
5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గతంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ పోటీలో 12 టీంలు పాల్గొన్నాయి. ఈ పోటీలో 'యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా (టీ. యూ.) విద్యార్థి మొహమ్మద్ బుర్హానుద్దీన్ టీం (అనిల్ కుమార్, రాజేష్, భానుచందర్, నరేష్ ) ప్రథమ బహుమతి సాధించింది. బుధవారం నిర్వహించిన ఫ్రెషర్స్ అండ్ ఫేర్వెల్ కార్యక్రమంలో విజేతలకు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ బహుమతి అందించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపల్ డా.కే.ప్రసన్న రాణి, సీనియర్ ప్రొఫెసర్ డా.జెట్లింగ్ ఎల్లోసా, హెచ్ వో డి డా.బీ.స్రవంతి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. సవాళ్లతో కూడిన న్యాయవాద వృత్తిలో ఎలా రాణించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అరుణ్, అశోక్ తో పాటు అలీ ముర్తుజా లోహియా, క్రాంతి, ఇర్ఫాన్,లక్ష్మణ్,చంద్రసేన్, గాయత్రి, శిరీష, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.