Banswada News
బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా మమ్మాయి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు.
Quick Summary:
జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు.
5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బోర్లం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మమ్మాయి లక్ష్మణ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా లక్ష్మణ్‌కు శాలువా కప్పి,పూలమాల వేసి ఘనంగా సన్మానించారు.అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ,ఆయురారోగ్యాలతో పాటు ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ,మండల నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొని లక్ష్మణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.