Banswada News
టీచర్స్ కాలనీలో ఆయుష్మాన్ భారత్ ABHA కార్డుల నమోదు
Quick Summary:
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఖలేఖ్, కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా గౌస్.
5TV న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో గల వడ్ల సంఘం కార్యాలయంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) కార్డుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ABHA కార్డు పొందని అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖలేఖ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా గౌస్ పాషా కోరారు.నమోదు కోసం ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో వడ్ల సంఘం కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ సేవ పూర్తిగా ఉచితమని, ప్రజలు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ప్రభుత్వ ఆరోగ్య సేవలను సులభంగా పొందేందుకు ABHA కార్డును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. టీచర్స్ కాలనీతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.