5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : కామారెడ్డి జిల్లా లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు) ఆరోగ్య సూచికల్లో 100 శాతం లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జె. వెంకటి ఆదేశించారు.బుధవారం కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో PHCల సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మాతా–శిశు ఆరోగ్యం, సర్వత్ర టీకాల కార్యక్రమం, క్షయవ్యాధి నిర్మూలన, డెంగ్యూ–మలేరియా నివారణ చర్యలు, HMIS నివేదికల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు.ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, వారికి అవసరమైన వైద్య సేవలు అందేలా క్షేత్రస్థాయి పర్యటనలు మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు రాజు, రోహిత్ కుమార్‌తో పాటు సంబంధిత అధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
Banswada News
ఆరోగ్య సూచికల్లో 100 శాతం లక్ష్యాలు సాధించాలి : డీఎంహెచ్‌వో డా. జె. వెంకటి
Quick Summary:
మాతా–శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి