Banswada News
13వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహణ.
Quick Summary:
దోమల నివారణే లక్ష్యం...కౌన్సిలర్ మహమ్మద్ ఖాలేక్.
5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖాలేక్, కో-ఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్, వార్డు ఆఫీసర్ రోహిత్తో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మహమ్మద్ ఖాలేక్ మాట్లాడుతూ.పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం, దోమల నివారణకు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డేను పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను నివారించవచ్చని సూచించారు. ప్రజలందరూ పరిశుభ్రత పాటిస్తూ మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు.