Banswada News
బాన్సువాడలో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు...
Quick Summary:
ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రాజకీయ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ.
5టీవీ న్యూస్ బాన్సువాడ : స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓ రవీందర్ రెడ్డి, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రాజ నరేందర్ గౌడ్, డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పి విట్టల్ రెడ్డి,మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఆనంద్, పట్టణ పోలీస్ స్టేషన్లో పట్టణ సిఐ తుల శ్రీధర్, రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ తిరుపతయ్య,ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ దిలీప్ కుమార్,విద్యుత్ కార్యాలయంలో ఎఈ సంతోష్ కుమార్,మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి అంజవ్వ గణేష్,ఐకెపి కార్యాలయం వద్ద ఎపీఎం నాగరాజు , మున్నూరుకాపు సంఘం వద్ద రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్, ఇరిగేషన్ కార్యాలయంలో, ఫారెస్ట్ కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ హబీబ్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఫైర్ స్టేషన్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సూపర్డెంట్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి,బిజెపి పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్,సిపిఐ కార్యాలయంలో దుబాస్ రాములు, వివిధ ప్రభుత్వ శాఖలు,అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడి కేంద్రాలలో జాతీయ పథకాన్ని ఎగురవేసి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.